Header Banner

వేసవి వచ్చేసింది! ఆన్‌లైన్‌లో ప్యాకేజీలు చూద్దాం! హాలిడే ట్రిప్ వేద్దాం!

  Sat May 03, 2025 13:40        Travel

హైదరాబాద్‌ నుంచి పర్యాటక, సందర్శనీయ స్థలాలకు ప్రత్యేక ప్యాకేజీలపై వెళ్లే వారి కంటే సొంతంగా ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో వారి వివరాలు అందుబాటులో ఉండటం లేదు. ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు ఉండటంతో నేరుగా ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దేశంలోని వందలాది పర్యాటక ప్రదేశాలతో పాటు చుట్టుపక్కల దేశాలకు రాష్ట్రం నుంచి భారీగా వెళ్తున్నారు.

 

అప్పట్లో స్థానికంగా ఉండే టూరిజం ఏజెన్సీల ద్వారా ప్యాకేజీలు బుక్‌ చేసుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పర్యాటక ప్యాకేజీలు, ఆయా ప్రాంతాల వివరాలతో పాటు నగరం నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు విమానాలు, రైళ్లు అందుబాటులో ఉండటంతో సొంతంగానే బుక్‌ చేసుకుని వెళ్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని పర్యాటక, సందర్శనీయ స్థలాలకు సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి: తక్కువ ధరలో అదిరిపోయే SUVలు! టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్‌లలో ఏది బెస్ట్ ?

 

విమాన ప్రయాణానికి ప్రాధాన్యం : పర్యాటక ప్రదేశాలు, అక్కడికి చేరుకోవడానికి మార్గాలు, వసతుల వివరాలు ఆన్‌లైన్‌లోనే తెలుసుకుంటున్నారు. వ్లాగర్లు, బ్లాగర్లు పూర్తి సమాచారం అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి అన్ని ప్రాంతాలకు ఫ్లైట్లు ఉండడంతో విమాన ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల పర్యాటక సంస్థలు లేదా ప్రైవేటు టూరిజం ఆపరేటర్ల ద్వారా అందుబాటులోని ప్యాకేజీలను ఎంపిక చేసుకుని వెళ్తున్నారు. పిల్లలకు పరీక్షలు పూర్తికావడం, సెలవులు కలిసి రావడంతో తీసుకుని కొన్ని వారాలుగా నగరం నుంచి భారీగా దక్షిణ భారతంలోని కీలకమైన వేసవి విడిది ప్రదేశాలైన ఊటీ, కొడైకెనాల్, మున్నార్, కూర్గ్‌తో పాటు ఉత్తరాదిన చల్లటి ప్రదేశాలు, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తున్నారు.

 

దీంతో సమాచారం దొరకడం కష్టంగా మారింది : తాజాగా పహల్గాం దారుణ ఘటన జరిగిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి కశ్మీర్‌కు వెళ్లి చిక్కుకున్న పర్యాటకుల వివరాలను తెలుసుకునేందుకు ఆ శాఖ ప్రయత్నించినా, ఉపయోగం లేకుండా పోయింది. సొంత ఏర్పాట్లతో వెళ్లిన వారు స్వచ్ఛందంగా చెబితే తప్ప తెలిసే అవకాశం లేకుండా పోయిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నగరం నుంచి శ్రీనగర్‌కు నేరుగా విమానాలున్నాయి. అక్కడికి ఎక్కువగా పర్యాటకులు, వ్యాపారులు వెళ్తున్నారు. జనవరి నుంచి మే, ఆగస్టు నుంచి అక్టోబర్‌ సమయంలో జమ్మూకశ్మీర్‌కు వెళ్తున్నట్లు అంచనా.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravsi #HolidayPackages #TravelDeals #VacationVibes #ExploreMore #Wanderlust #TripGoals #BudgetTravel